సోమవారం, 20 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (12:53 IST)

నేడు ఎర్త్ అవర్ పాటించాలి: ఏపీ గవర్నర్ పిలుపు

ఏపీ ప్రజలు నేడు ఎర్త్ అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ పిలుపునిచ్చారు. రాత్రి 8.30 నుంచి 9.30 నిమిషాల వరకు దీనిని పాటించాలని కోరారు. గంటపాటు విద్యుత్ దీపాలు, పరికరాలు ఆపివేయాలని సూచించారు. 
 
అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని బిశ్వభూషణ్ వివరించారు. కాలుష్యాన్ని తగ్గించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రతిఏటా మార్చి 26 వతేదీన ఎర్త్‌ అవర్‌ను పాటిస్తున్నారు.
 
గ్రహం సహజ పర్యావరణం కాపాడటం, ప్రకృతికి అనుగుణంగా మానవులు జీవించే భవిష్యత్తును నిర్మించడం, వ్యర్థ వినియోగాన్ని భారీ ఎత్తున తగ్గించటానికి 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లైట్స్ అవుట్ ఈవెంట్‌గా ఎర్త్ అవర్‌ను ప్రారంభించారు.