బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (10:07 IST)

హమ్మయ్య ఇక హైదరాబాదులో రోడ్లు దాటడం ఈజీ!

హైదరాబాద్ నగరంలో రహదారులన్నీ నిత్యం రద్దీగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోడ్డు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
రోడ్డు దాటే క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాలకూ గురవుతున్నారు. వీరి కష్టాలను గుర్తించిన అధికారులు పలు చోట్లు ఫుట్ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు. ఈ క్రమంలో నగరంలోని చందానగర్‌లో పాదాచారులు ప్రమాదాలకు గురి కాకుండా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించారు.
 
దీప్తి శ్రీ నగర్ ఎంట్రన్స్ ఎదురుగా జాతీయ రహదారి 65 పై రూ.5.5 కోట్లు, పీజేఆర్ ఎన్ క్లేవ్ వద్ద రూ. 5.2 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.
 
ఈ రెండు బ్రిడ్జీలను గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ శేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ లు ప్రారంభించనున్నారు. 
 
హైదరాబాద్ నగర వ్యాప్తంగా 4 ప్యాకేజీల ద్వారా రూ. 127.3 కోట్లు వ్యయంతో 21 ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టారు. శేర్ లింగంపల్లిలో రూ. 39.70 కోట్ల వ్యయంతో 5 వంతెన పనులను ప్రతిపాదించారు. అందులో రెండు పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి.