బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (13:39 IST)

తెలంగాణాలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్య ఖాతా - 16 అంకెల యూనిక్ ఐడీ

దేశంలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ రికార్డులను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయుష్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కింద హెల్త్ అకౌంట్లను ఓపెన్‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని ఏర్పాటు చేసేందుకు యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
గత ఏడాది ప్రారంభించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల కిందటే ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే నెల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. 
 
హెల్త్ అకౌంట్లలో మన ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులన్నీ దాచుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినట్టుగా, ముందుగా మన ఆధార్ కార్డు, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(https://healthid.ndhm.gov.in/)లో హెల్త్ అకౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వివరాలు ఎంటర్ చేయగానే 16 అంకెలతో కూడిన అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయిస్తారు. 
 
ఆధార్‌‌ నంబర్‌‌ మాదిరిగానే ఈ నంబర్ ఎవరిది వాళ్లకే యూనిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. ఇదే మన హెల్త్ అకౌంట్ నంబర్ లేదా హెల్త్ ఐడీగా ఉపయోగపడుతుంది. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు ఈ ఐడీ చెబితే సరిపోతుంది. ఒకవేళ ఐడీ లేకపోతే, మన వివరాలు తీసుకుని హాస్పిటల్ వాళ్లే ఐడీ క్రియేట్ చేసి ఇస్తారు. 
 
డాక్టర్ కన్సల్టేషన్ వివరాల దగ్గరి నుంచి, మనం చేయించుకున్న టెస్టులు, మనం వాడిన మెడిసిన్ సహా అన్ని వివరాలు అందులో హాస్పిటల్ వాళ్లే అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేస్తారు. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లిన ప్రతిసారి పాత రికార్డులు పట్టుకుపోయే తిప్పలు ఉండవు.