బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (19:25 IST)

తెలంగాణలో జిల్లాల వారీగా మార్చి నుంచి జాబ్ మేళా

తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ త్వరలో జిల్లా కేంద్రాల్లో జాబ్ మేళా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్ తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ అండ్ ఉపాధి సంస్థ, సెట్విన్ సంయుక్తంగా జాబ్ మేళాను సవ్యసాచి చేతుల మీదుగా ప్రారంభించారు. 
 
మార్చి 5న మహబూబ్ నగర్ జిల్లాలో, 6వ తేదీన ఖమ్మం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సవ్యసాచి ప్రకటించారు. 
 
ఇలా వరుసగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మార్చి నెలలో జాబ్‌ మేళా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగ పరచుకోవాలని పిలుపునిచ్చారు.