శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (19:41 IST)

బాలికను నమ్మించి తీసుకెళ్లాడు.. గంజాయి ఇచ్చి సామూహిక అత్యాచారం

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు రక్షణ దొరకడం లేదు. 
 
నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో అమాయక పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. తాజాగా రాజన్న-సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దారుణం జరిగింది. మాయమాటలతో బాలికను నమ్మించి తీసుకెళ్లిన ఓ నీచుడు, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఇంటర్‌ చదువుతున్న విద్యార్థినిపై కన్నేసిన పొరుగింటి యువకుడు మాయ మాటలతో మూడు రోజుల క్రితం తనతో తీసుకెళ్లాడు. గంజాయికి అలవాటు పడ్డ మరో ముగ్గురు మిత్రులతో కలిసి.. ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆ బాలికపై నలుగురు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాదు, ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఎవరికైనా చెబితే.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించారు.
 
మూడు రోజుల తర్వాత ఆ బాలికను వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులను కూడా వీడియోల పేరుతో బెదిరించారు. చివరికి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.