శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 మే 2021 (10:56 IST)

తెలంగాణాలోని ఆస్పత్రులకు వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందే...

తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన రోగులు చేరాలంటే ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సిందేనని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 
 
ఆంధ్రప్రదేస్, ఒడిషా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణాకు వచ్చే కరోనా రోగుల సంఖ్య అధికమైపోయింది. దీంతో తెలంగాణ ఆసుపత్రులకు వచ్చే వారికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.
 
 
పొరుగు రాష్ట్రాల నుంచి అంబులెన్సులు, వాహనాల్లో చికిత్స కోసం పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలి వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. వారి వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉండడంతో సీఎస్ సోమేశ్ కుమార్ నిన్న ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేశారు.
 
ఇక నుంచి హైదరాబాద్‌లో చికిత్స కోసం వచ్చే రోగులు ఇక్కడి ఆసుపత్రులలో ముందుగా బెడ్‌ను రిజర్వ్ చేసుకుని వుంటేనే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. ఈ వివరాలను కంట్రోల్ రూము (040 2465119, 9494438251)కు కానీ, లేదంటే [email protected] వెబ్‌సైట్‌కు కానీ ఆయా ఆసుపత్రులు తెలియజేయాల్సి ఉంటుంది. 
 
ఇందుకోసం రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్ పేరు, మొబైల్ నంబరు, టైఫ్ ఆఫ్ బెడ్ వంటి వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. రోగుల వాహనాలు రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు ఈ వివరాలను చెబితే అనుమతిస్తారు. ఇందుకోసం సరిహద్దుల వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.