సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 సెప్టెంబరు 2021 (11:18 IST)

ఇంటర్నేషనల్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్ పోచంపల్లి

అంతర్జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి ఎంపికైంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో నిర్వహించే బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌కు రాష్ట్రం ఈ గ్రామం ఎంపికయింది. 
 
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామం. ఈ ఊరు ఓ సరికొత్త ఘనత దక్కించుకోబోతుంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూఎన్ డబ్ల్యూటివో సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్‌కు ఈ గ్రామం పోటీ పడుతోంది. 
 
దేశవ్యాప్తంగా మూడు గ్రామాలు ఈ ఘనత దక్కించుకునేందుకు పోటీలోకి దిగగా అందులో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఒకటిగా నిలవడం గమనార్హం. 
 
గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో యూఎన్ డబ్ల్యూటివో  సంస్థ బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ ను నిర్వహిస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన ఈ పోటీ  ప్రధాన ఉద్దేశం. 
 
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో భారత్ నుంచి మూడు గ్రామాలు ఎంట్రీ సంపాదించాయి. వాటిలో మేఘాలయ నుంచి విజిలింగ్ విలేజ్  కాంగ్ దాన్ ఒకటి కాగా.. రెండవది మధ్యప్రదేశ్ లోని  లద్ పురా ఖాస్ గ్రామం.. మూడో విలేజ్ గా తెలంగాణ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం. 
 
ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లా లోని భూదాన్ పోచంపల్లికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశంలోనే  తొలిసారి భూదానోద్యమం ప్రారంభం అయ్యింది ఈ గ్రామం నుంచే. అప్పటి వరకు మాములు పోచంపల్లిగా పిలువబడే ఈ గ్రామం భూదాన్ పోచంపల్లి గా ప్రసిద్దికెక్కింది. అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరలు తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే.