Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు షాకివ్వనున్న తెలంగాణ సర్కారు.. మరోమారు చార్జీల బాదుడు

Written By ఠాగూర్
Updated: శుక్రవారం, 21 జనవరి 2022 (09:47 IST)
తెలంగాణ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తేరుకోలేని షాకివ్వనుంది. ఇప్పటికే ఒకసారి పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను మరోమారు భారీగా పెంచాలని భావిస్తోంది. రూ.4,500 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఈ పెంపునకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. 
 
ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ముఖ్యంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా 50 శాతం మేరకు పెంచాలన్న సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, ఆటస్థలాల విలువను 35 శాతం, బహుళ అంతస్తు భవన సముదాయం విలువ 25 శాతం పెంచే దిశగా కసరత్తులు చేస్తుంది. అన్నీ అనుకూలిస్తే ఈ కొత్త బాదుడు వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎకరం భూమి దాదాపు రూ.30 లక్షల వరకు పలుకుతుంది. ఇపుడు దీన్ని 50 శాతం మేరకు పెంచితే అంటే రూ.60 లక్షలకు పైగా పలికే అవకాశం ఉంది. 

అన్నీ చూడండి

సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రం ధర్మన్ రెండవ షెడ్యూల్ పూర్తి

Ananya Nagalla: రెండు భిన్నమైన జోనర్లతో అనన్య నాగళ్ల చిత్రం లీసా సిద్ధం

వేణు ఊడుగుల సమర్పణ లో అడ్వెంచర్ మూవీగా చంద్రయాన్

Raj Tarun: టార్టాయిస్ యూనిక్ థ్రిల్లర్ మూవీ : రాజ్ తరుణ్

Naga Chaitanya :నాగ చైతన్య లాంచ్ చేసిన ది రేజ్ ఆఫ్ వారాహి సాంగ్

తర్వాతి కథనం
Show comments