సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (21:18 IST)

టెన్త్ క్లాస్ శ్రావణి మిస్సింగ్... బావిలో బ్యాగు, పక్కనే మద్యం బాటిళ్లు...

సెలవుల్లో పదవ తరగతి కోసం స్పెషల్ క్లాస్ అని వెళ్లిన అమ్మాయి అదృశ్యమైన సంఘటన హజీపురంలో చోటుచేసుకుంది. ప్రతిరోజులానే కీసరలో సెరినీటి ప్రవేట్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తిచేసిన శ్రావణి నిన్న ఉదయం స్కూలుకి వెళ్లి వచ్చి సాయంత్రం బస్సు దిగి ఇంటికి వస్తున్న సమయంలో కనపడకుండా పోయింది. శ్రావణి రాత్రి ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వెతికిన కుటుంబ సభ్యులు శ్రావణి ఆచూకి కోసం పోలీసులకు పిర్యాదు చేశారు.
 
వివరాలు పరిశీలిస్తే భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజిపూర్ గ్రామానికి చెందిన పాముల నర్సింహ కూతురు పాముల శ్రావణి (14) మేడ్చల్ జిల్లా కీసరలో సెరినిటీ స్కూల్లో 9వ తరగతి పూర్తి చేసింది. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి కావడంతో స్కూల్ స్పెషల్ క్లాస్ నిర్వహిస్తున్నారు. రోజులాగే గురువారం ఉదయం స్కూలుకి వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోవడంతో అమ్మాయి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 
 
గురువారం రాత్రి నుండి ఆచూకి కోసం గాలిస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయo హాజిపూర్ శివార్లలో ఉన్న (మర్రి భావి) అనే ఓ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పాడుబడ్డ భావిలో శ్రావణి స్కూల్ బ్యాగు కనిపించడంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈ సందర్భంగా సీఐ సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... బావి పక్కనే మద్యం సీసాలు కనిపించాయన్నారు. అనుమానంతో దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వెతికినా కూడా బాలిక ఆచూకీ లభించకపోవడంతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపామని అన్నారు సీఐ.
 
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అక్కడ పక్కనే మద్యం సీసాలు, స్కూల్ బ్యాగ్ నుండి లభించిన ఆధారాలను సేకరించామని తెలిపారు. విద్యార్థిని అదృశ్యం అవడంపై దర్యాప్తు ముమ్మరం చేశామనీ, ఈ సంఘటన దృష్ట్యా ఐదు ప్రత్యేక బృందాలను శ్రావణి ఆచూకి కోసం గాలిస్తున్నారు.