ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (22:55 IST)

వివాహేతర సంబంధం: అందుకే నవ్యారెడ్డికి పండ్ల రసంలో మత్తు మందుకలిపి చంపేసాడు

ఖమ్మం​: జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే.. భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మృతురాలు ఎర్రమల్ల నవ్య రెడ్డి (22)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నవ్యరెడ్డి కనబడటం లేదని మిస్సింగ్ కేసు నమోదయింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసు పెట్టింది కూడా భర్తే.
 
మిస్సింగ్‌లో భాగంగా పోలీసులు విచారణ చేస్తుండగా.. శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్యరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నవ్యరెడ్డిని భర్త బైక్ పైన తీసుకువెళ్తున్న సీసీటివి ఫుటేజ్‌ని పోలీసులు సేకరించి చూడగా నవ్యను హత్య చేసింది స్వయంగా భర్తే అని తేలింది.
 
దీనితో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం నాగశేషు రెడ్డితో నవ్యరెడ్డికి వివాహం జరిగింది. ఇద్దరిది మధిర మండలం ఏర్రుపాలెం గ్రామం. నవ్యరెడ్డి సత్తుపల్లిలో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతు ఉండగా... నాగశేషురెడ్డి బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

కాగా తమ కుమార్తెను హత్య చేయడానికి కారణం శేషురెడ్డికి మరో యువతితో వున్న వివాహేతర సంబంధమేనని నవ్యారెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు.