ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: గురువారం, 30 జులై 2020 (19:25 IST)

కూతురు వరసయ్యే యువతితో ప్రేమాయణం, విషయం బయటపడటంతో ఊరి బయటకెళ్లి?

వరసకు ఆమె అతనికి కూతురవుతుంది. అయితే వావివరసలు మర్చిపోయాడు. ప్రేమిస్తున్నానని ఆ యువతి వెంట తిరిగాడు. ఆమె ఎంత వద్దని చెప్పినా కాళ్లావేళ్లా పడ్డాడు. అతడి ఒత్తిడికి ఆమె లొంగిపోయింది. చివరకు ఇద్దరూ కలిశారు. శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. విషయం బంధువులకు తెలియడంతో వరస కుదరదని ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ ఆత్మహత్య యత్నం చేశారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని సాలార్‌పూర్ గ్రామానికి చెందిన రమేష్ హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కరోనా కారణంగా సొంత ఊరికి వచ్చేశాడు. అదే ప్రాంతానికి చెందిన 22 యేళ్ల యువతిని చూశాడు. అతడు ఆమెకి బాబాయ్ వరస అవుతాడు.
 
అయితే అదంతా పక్కనబెట్టి రెండు నెలల పాటు ప్రేమ పేరుతో ఆమె వెంటపడ్డాడు. ఆమె ఎంత వారించినా... దూరపు బంధురికమనీ, ఆ వరసలు లేవంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. ఆమె కూడా అతనితో సర్దుకుపోయింది. శారీరకంగా కలిశారు. విషయం కాస్త బంధువుల వరకు వెళ్ళింది.
 
దాంతో యువతికి వేరే పెళ్ళి నిర్ణయించారు. ఆగస్టు 10వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరిపోవడంతో నిన్న సాయంత్రం ఇంటి నుంచి ఊరి బయటకు వచ్చి ఉరి వేసుకున్నారు. ఈ ఘటనలో యువతి చనిపోగా రమేష్ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.