సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 జులై 2021 (09:47 IST)

కరెన్సీ నోట్లను ముక్కలు చేసిన ఎలుకలు.. అండగా నిలిచి మంత్రి సత్యవతి

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా వేమునూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాకు చెందిన భూక్య రెడ్యా అనే రైతు కడుపులో కణితి ఆపరేషన్ కోసం బీరువాలో దారుచుకున్న రూ.2 లక్షల కరెన్నీ నోట్లను ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. 
 
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చికిత్స కోసం దాచుకున్న నగదును ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండ‌గా నిలిచారు. రెడ్యాకు మంత్రి స‌త్య‌వ‌తి ఫోన్ చేసి మాట్లాడారు.
 
రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తాన‌ని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందిస్తామ‌ని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎమ్మార్వో రంజిత్‌ని రైతు రెడ్యా దగ్గరకు పంపించి, ధైర్యం చెప్పారు. రెడ్యా డబ్బుల విషయంలో గాని, చికిత్స విషయంలో గాని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా మంత్రి హామీతో రైతు రెడ్యా సంతోషం వ్యక్తంచేశారు.