Daily Horoscope
✕

'క్లౌడ్ బరస్ట్‌' విదేశీ కుట్ర అయితే, ఆధారాలు కోరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Written By ఠాగూర్
Updated: సోమవారం, 18 జులై 2022 (08:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా కురిసిన భారీ వర్షాలు విదేశీ కుట్ర అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా వర్షాలు క్లౌడ్ బరస్ట్ కుట్ర అయితే, దానికి సంబంధించిన ఆధారాలు ఇస్తే కేంద్రం దర్యాప్తు చేయిస్తుందని ఆయన తెలిపారు. 
 
ప్రకృతిపరంగా వచ్చిన వర్షాలను కూడా కుట్ర కోణంలో చేసిన సీఎం చేసిన ఆరోపణలను కేంద్రం సీరియస్‌గా తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ, ఏపీలలో ఇటీవల గోదావరి వరదలు, లడఖ్, ఉత్తరాఖండ్ వరదలకు కారణమైన క్లౌడ్ బరస్ట్‌లపై విదేశీ కుట్ర విషయంలో సంచలన ఆరోపణలు చేసిన సీఎం కేసీఆర్ అందుకు సరైన ఆధారాలు సమర్పిస్తే కేంద్రం సీరియస్‌గానే విచారణ చేయిస్తామని కిషన్ రెడ్డి ట్వీట్స్ చేశారు.
 
ఆదివారం భద్రాచలం వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ వర్షాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. దేశంలో పలు ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ సృష్టిస్తున్నట్లు తమకు తెలిసిందన్నారు. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని అన్నారు. గతంలో లద్దాఖ్, లేహ్, ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగిందని చెప్పారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంపై కూడా కుట్ర చేసినట్లు కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. 

 

అన్నీ చూడండి

ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడితే నాకు కిడ్నీ వ్యాధి వచ్చింది, ఆస్పత్రి పాలయ్యా: మలయాళీ సింగర్ సలీం

తిరునెల్వేలిలో యంగ్ రివల్యూషనరీ లీడర్ త్రిష ఫోరమ్.. ఫోటో వైరల్

మమితా బైజు, ప్రదీప్ రంగనాథన్‌ ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు వైరల్

Vishnu Manchu : ప్రభుదేవా తో తమిళరంగంలోకి ఎంట్రీ ఇస్తున్న విష్ణు మంచు

Niharika Konidela: పాకెట్ రాకెట్స్ తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ లోకి అడుగు పెట్టిన నిహారిక కొణిదెల

తర్వాతి కథనం
Show comments