సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (20:33 IST)

కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన ప్రమాదం

mla sitakka
తెలంగాణలోని ప‌లు జిల్లాల్లో కురిసిన భారీ వ‌ర్షాల‌కు ప‌లు గ్రామాల్లో భారీగా నీరు నిలిచిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఏటూరునాగారంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్ర‌జ‌ల‌కు సాయం చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వెళ్ళారు. 
 
ఆ స‌మ‌యంలో ఎలిశెట్టిపల్లి వాగు వ‌ద్ద‌ ఆమె ప్రయాణిస్తున్న పడవ ఒక్క‌సారిగా చెట్టుకు ఢీకొంది. ఆ వెంట‌నే వాగు ప్ర‌వాహానికి ఆ పడవ ఒడ్డుకు కొట్టుకుపోయింది. ప‌డ‌వ‌లో ఉన్న సీతక్క ఎట్ట‌కేల‌కు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. 
 
అనంతరం ఆమె తన పర్యటనను కొనసాగించారు. కాగా, ప‌లువురు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సీత‌క్క‌ నిత్యావసరాలు పంపిణీ చేశారు.