1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (13:24 IST)

తెలంగాణాలో రేపు భారీ వర్షాలు : వాతావరణ శాఖ

rain
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, శనివారం కూడా ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 
 
ఒరిస్సా తీరంపై అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులు ఉపరితల ఆవర్తనం విస్తరించిందని తెలిపింది. దీనికితోడు రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉండటంతో ఆది, సోమవారాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. 
 
ఇదిలావుంటే శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, పాలమూరు జిల్లాలో అత్యధికంగా 1.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లాలోని ధర్మవరంలో అత్యల్పంగా ఒక సెంటీమీటరు వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు.