సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (08:43 IST)

నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు..

rain
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కుంభవృష్టి కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చింది. సాయంత్రం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది.
 
 దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించడంతో తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో సోమవారం భారీగా, మంగళవారం ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న చెప్పారు. 
 
ఈ నెల 14, 15 తేదీల్లో తగ్గిన వర్షాలు 16 నుంచి మళ్లీ పుంజుకున్నాయి. దీంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని ఆమె తెలిపారు. మరోవైపు, వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.