మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ముగ్గురు పిల్లల తల్లితో మజా.. చివరకు చంపేసి ఠాణాకు వెళ్లాడు..

తెలంగాణ రాష్ట్రంలో మరో దారణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లితో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరి బంధం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. చివరకు జిల్లా శివారు ప్రాంతాల్లో ఆ మహిళను దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా దేవరుప్పల మండలానికి చెందిన ఓ మహిళ (41) భర్త 15 ఏళ్ల క్రితం మృతి చెందాడు. పైగా, ఆమెకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు వెళ్లి అక్కడ ఓ ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ, తన పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. 
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే డ్రైవర్‌గా పని చేస్తున్న పెద్దమడుగుకు చెందిన ఆర్య కుమార్‌ గౌడ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె మరొకరితో సన్నిహితంగా ఉంటున్నట్లు ఆర్య కుమార్‌కు అనుమానం మొదలైంది. 
 
విధుల నిమిత్తం బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆ మహిళ ఫోన్‌ స్విచ్చాఫ్‌ కావడంతో, ఆమె పిల్లలు కంపెనీకి వెళ్లి ఆరా తీయగా విధులకు రానట్లు తేలింది. దీంతో వారు ఆర్య కుమార్‌కు ఫోన్‌ చేయగా అసభ్యంగా దూషిస్తూ ఆమె ఎక్కడికి వెళ్లిందో తెలియదని చెప్పాడు. ఆ తర్వాత బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. 
 
ఈ క్రమంలో తానే హత్య చేశానంటూ ఆర్యకుమార్‌ గురువారం భువనగిరి పట్టణ ఠాణాలో లొంగిపోయాడు. బుధవారం సాయంత్రం ఇద్దరం కలిసి బస్సులో హైదరాబాద్‌ నుంచి భువనగిరికి వచ్చి ఓ రియల్‌ఎస్టేట్‌ వెంచర్‌ వద్దకు చేరుకున్నామని, అక్కడ ఇరువురి మధ్య డబ్బు, బంగారం విషయంలో వివాదం తలెత్తడంతో సర్జికల్‌ కత్తితో గొంతు కోసి తలపై బండరాయితో మోది హత్యచేసినట్టు చెప్పాడు. అనంత రం ఠాణాకు వచ్చి లొంగిపోయాడు.