వివాహేతర సంబంధం : మనీ కోసం గొడవపడి సర్కిల్ బ్లేడుతో గొంతు కోసేశాడు...

ఠాగూర్| Last Updated: గురువారం, 12 నవంబరు 2020 (11:17 IST)
ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వివాహితతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ కావడంతో ఆమెను బాగా వాడుకున్నారు. విచ్చలవిడిగా శారీరకసుఖం అనుభవించాడు. కానీ, డబ్బులో వారివద్ద చిన్నపాటి గొడవ జరిగింది. అంతే.. ఆ మహిళను నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా శివారుల్లో జరిగింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా పెద్దమడుగుకు చెందిన లక్ష్మి అనే మహిళ భర్త చనిపోవడంతో పని కోసం హైదరాబాద్‌‌కు వచ్చింది. ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పని చేస్తున్న ఆమె.. కొంతకాలంగా అదేగ్రామానికి చెందిన ఆర్య కుమార్‌‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఈ క్రమంలో ఇద్దరు బుధవారం హైదరాబాద్‌ నుంచి భునగిరి శివారులోని నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆర్యకుమార్‌ తన వద్ద ఉన్న సర్కిల్‌ బ్లేడ్‌తో లక్ష్మిని హత్య చేశాడు.

అర్థరాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతదేహాన్ని గుర్తించి, భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
దీనిపై మరింత చదవండి :