బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 నవంబరు 2020 (09:58 IST)

పొలం వద్దకు వెళ్ళిన యువకుడిపై పులి దాడి... మృతి!!

తెలంగాణ రాష్ట్రంలోని కుమరంభీమ్ జిల్లా దహెగాం మండలం, దిగిడలో ఓ పులి హల్చల్ చేసింది. అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వచ్చింది. ఆ సమయంలో పొలం వద్దకు వెళ్లిన ఓ యువకుడిపై మాటువేసి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు చనిపోయాడు. ఆ తర్వాత పుష్టిగా ఆరగించి వెళ్లిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరలాను పరిశీలిస్తే, దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్ (22) తన స్నేహితులు శ్రీకాంత్, నవీన్‌లతో కలిసి పత్తిచేను వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పొదలచాటున మాటువేసిన పులి విఘ్నేశ్‌పై దాడిచేసి నోట కరచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. అనంతరం అతడిని చంపేసింది. 
 
పులి దాడితో భయంతో వణికిపోయిన శ్రీకాంత్, నవీన్‌లు పరుగుపరుగున గ్రామంలోకి వెళ్లి విఘ్నేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా ఓ చోట విఘ్నేశ్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.