ఎల్లుండి ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ

sharmila Reddy
ఎం| Last Updated: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:42 IST)
ఎల్లుండి ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభ ఏర్పాటు చేయనున్నారు. సంకల్ప సభలో షర్మిల పార్టీ ప్రకటన చేయనున్నారు. షర్మిల సభకు ముఖ్య అతిథిగా వైఎస్ విజయలక్ష్మి హాజరుకానున్నారు.

లోటస్ పాండ్ నుంచి వెయ్యి కార్లతో ఖమ్మంకు ర్యాలీగా బయలుదేరనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే సభ జరుపుతామని షర్మిల టీమ్ వెల్లడించింది.

ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు కల్పించినా 9న ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన వైఎస్‌ షర్మిల సంకల్ప సభ జరిగి తీరుతుందని, సభ నిర్వాహక ఇన్‌చార్జ్‌ కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కరోనా లేదని ఖమ్మం జిల్లాలో వైరస్‌ కేసులు లేకపోయినా కరోనా పేరుతో సభకు ఆటంకాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఖమ్మంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సంకల్ప సభ నిర్వహిస్తామని ఇందుకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లతో సభకు హాజరయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు.దీనిపై మరింత చదవండి :