మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 23 మార్చి 2015 (17:23 IST)

మేమంతా మెగాస్టార్ నీడ నుంచి వచ్చాం... దాసరికి బన్నీ కౌంటరా...?!!

దాసరి నారాయణ రావు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన అన్న మాట ఒకటి ఇప్పుడు మెగా హీరోల్లో దుమారం రేపుతోంది. మొన్నామధ్య ఏకంగా నాగబాబును చుట్టుముట్టిన మెగా అభిమానులు దాసరి కామెంట్స్ చేస్తే ఎవ్వరూ ఏమీ మాట్లాడకపోవడం ఏంటంటూ మండిపడ్డారు. ఆ ఎఫెక్టో ఏమోగానీ రుద్రమదేవి ఆడియో వేడుక సందర్భంలో వరంగల్ వేదికగా అల్లు అర్జున్ మామయ్య చిరంజీవి గురించి మాట్లాడాడు. 

 
తామిప్పుడు స్టెప్పులేస్తున్నా... తామంతా నటులుగా వెలుగుతున్నా అదంతా మెగాస్టార్ చిరంజీవి వల్లనే అని అన్నారు. చిరంజీవి గారు ఆనాడు ఎండలో కష్టపడి పనిచేసి ఈ స్థాయికి చేరితే ఇప్పుడు తామంతా మెగాస్టార్ నీడలో బతుకుతున్నామనీ, హీరోలుగా మీముందు ఉన్నామంటూ అన్నారు. ఈ విషయాన్ని మెగా అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు.
 
ఇకపోతే... రుద్రమదేవి ఆడియో వేడుక వరంగల్ జిల్లాలో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు తలసాని, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సీనియర్ నటుడు కృష్ణంరాజు, అనుష్క, అల్లు అర్జున్ హాజరై సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.