కత్రినా ఖాన్ చేయాలనుకున్నా.. కానీ కత్రినా కపూర్‌గా..!: సల్మాన్ ఖాన్
''కత్రినా ఖాన్‌గా మారేందుకు నీకు ఓ అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు కత్రినా కపూర్‌గా మారిపోయావ్'' అని సల్మాన్ ఖాన్ తన సోదరి వివాహ వేడుకకు హాజరైన కత్రినా కైఫ్‌ను ఆటపట్టించాడు.
కత్రినా కైఫ్ నటించిన 'చిక్ని చమేలి' పాటకు డాన్సు చేసేందుకు సల్మాన్ కత్రినాను ఆహ్వానించాడు. కత్రినా రాకుండా కరణ్ జోహార్ వెనుక దాక్కుందట. అప్పటికీ వదలని సల్మాన్ "అయితే సరే, నీవు కత్రినా కైఫ్‌వి కాదు, కత్రినా కపూర్‌వే. ఇంక స్టేజి మీదకు రా" అని పిలిచాడట. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో స్టేజి దగ్గరకు వెళ్ళగా
"నేను ఏమీ చేయను... కత్రినా ఖాన్‌గా మారేందుకు నీకు ఓ అవకాశం ఇచ్చాను. కానీ నువ్వు కత్రినా కపూర్ గా మారిపోయావు" అని జోక్ చేసి సల్మాన్ అందరినీ నవ్వించాడట.