నిత్యమీనన్ కళ్లతోనే అలా.... దేవుడ అన్న అల్లు అర్జున్
అల్లు తాజాగా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ఇందులో నిత్యమీనన్‌తో పాటు సమంత, ఆదాశర్మ కూడా వున్నారు. వీరి నటన ఒకరికొరు పోటీగా వుందనే కామెంట్లు విన్పిస్తున్నాయి. అందులో నిత్యమీనన్ కేవలం కళ్ళతో హావభావాలు పలికిస్తూ చేసిన ఓ సన్నివేశం చిత్ర యూనిట్‌ను ఆశ్చర్యపర్చిందట.
ఇక అల్లు అర్జున్ తక్కువేం కాదు... ఆమె నటనను 'దేవుడా..' అంటూ సరదాగా కామెంట్ చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం చాలా హోప్స్‌తో వున్నాడు. ఇక ఇతర నటీనటుల పెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా వచ్చిందనీ, అందులో ఉపేంద్ర నటన చిత్రానికి హైలెట్‌గా వుంటుందని తెలుస్తోంది.