గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2015 (20:51 IST)

త్రిషా... కోటి రూపాయిలిస్తా.. నాతో నటిస్తావా...?: డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్

కోటి రూపాయలు ఇస్తానంటే ...ఏ నటైనా ఓకే.. మీ సినిమాలో నటిస్తానని ఠక్కున చెబుతుంది. పోనీ హీరోయిన్‌ కాకపోయినా ఐటంసాంగ్‌తో ముందుకు రమ్మన్నా వస్తుంది. అయితే ఇప్పుడు చాలామంది హీరోయిన్ల ట్రెండ్‌ మారింది. చేసే సినిమాలో హీరో ఎవరు..? దర్శకుడు ఎవరు...? అనేది చూస్తున్నారు.

ఇదివరికిటిలా ఎలా బడితే అలా సినిమాలు ఒప్పుకోవడంలేదు. ఆఖరికి శివాజీ హీరోగా అన్నా ఏ హీరోయిన్‌ ముందుకు రావడంలేదు. దీంతో తనే బాధపడి.. ఇండస్ట్రీ ఇలా తయారైందని సెలవిచ్చాడు కూడా.

ఇప్పుడు నటి త్రిషకు అచ్యుతన్‌ శంకర్‌ అనే తమిళ దర్శకుడు సినిమాకు ఆఫర్‌ ఇచ్చాడు. ఏకంగా కోటి రూపాయలు ఇస్తానన్నాడు. అయితే కథ వినే ముందు హీరో ఎవరని అడిగతే.. తనే అన్నీ అని చెప్పాడు. దాంతో కాసేపు ఏదో ఫోన్‌లో మాట్లాడుతూ.. ఏడాదిపాటు డేట్స్‌ ఖాళీగా లేవని చెప్పేసింది. తనకు డబ్బుతో పనిలేదు. ప్రిస్టేజ్‌ ముఖ్యమని సన్నిహితుల వద్ద త్రిష సెలవిచ్చిందట.