బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2024 (13:34 IST)

జాతర షాట్ కోసం 51 టేక్‌లు ఇచ్చిన అల్లు అర్జున్

Pushpa 2
Pushpa 2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ టీజర్‌ రికార్డులను బ్రేక్ చేస్తోంది. నెట్టింట ఈ వీడియో హల్ చల్ చేస్తోంది. ఈ టీజర్ కోసం అల్లు అర్జున్ పనిచేసిన విధానంపై బన్నీ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని టీమ్ స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ తన హిస్ట్రియానిక్స్‌ సరిగ్గా రావడం కోసం దాదాపు 51 టేక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
జాతర లుక్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. నటుడు చీర కట్టుకుని తాండవం చేస్తూ కనిపించాడు. ఈ ఒక్క నిమిషం టీజర్‌ను సరిగ్గా రూపొందించడానికి చాలా హోమ్‌వర్క్ చేశాం. అల్లు అర్జున్ టీజర్ కోసం ఓపికగా చిత్రీకరించాడు. 
 
ఖచ్చితమైన షాట్ కోసం 51 టేక్‌లు ఇచ్చాడు. ఈ చిత్రానికి పని చేస్తున్న సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి కూడా అల్లు అర్జున్ సినిమా కోసం చాలా కష్టపడ్డాడని మేకర్స్ తెలిపారు. అల్లు అర్జున్ డెడికేషన్ లెవల్స్‌ని రెసూల్ మెచ్చుకున్నాడు.
 
ప్రస్తుత కాలంలోని అత్యుత్తమ స్టార్లలో అల్లు అర్జున్ ఒకడు అని పేర్కొన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పుష్ప: ది రూల్ సునీల్, అనసూయ, రష్మిక, ఫహద్ తదితరులు నటిస్తున్నారు.