శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr

చాలా మంది నమ్మి మోసపోయా... విడాకులపై స్పందించిన మలయాళ హీరో

మలయాళ నటుడు దిలీప్ తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై స్పందించారు. ఈమెకు విడాకులు ఇవ్వడానికి తన ప్రస్తుత భార్య కావ్య కారణమంటూ వార్తలు వచ్చాయి. ఈ అంశం పెను వివాదాస్పదంగా మారింది

మలయాళ నటుడు దిలీప్ తన మాజీ భార్య మంజు వారియర్ నుంచి విడాకులు తీసుకున్న అంశంపై స్పందించారు. ఈమెకు విడాకులు ఇవ్వడానికి తన ప్రస్తుత భార్య కావ్య కారణమంటూ వార్తలు వచ్చాయి. ఈ అంశం పెను వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో మలయాళ హీరో స్పందించారు. 
 
మంజు వారియర్‌తో విడాకులకు, ప్రస్తుత తన భార్య కావ్యకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను చాలా మందిని నమ్మి, మోసపోయానని చెప్పుకొచ్చాడు. అలా మోసపోయిన ప్రతిసారి మౌనంగా ఉండేవాడినని, అందుకు కారణం తన కుమార్తె భవిష్యత్తు గురించిన ఆలోచనలేనని (తన మాజీ భార్య కూతురు) తెలిపాడు. 
 
అయితే, ఇప్పుడు తన మాజీ భార్య తన జీవితాన్ని సంతోషంగా సాగిస్తోందని, అదేవిధంగా తాను కూడా తన జీవితాన్ని భార్య కావ్యతో కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి తామిద్దరం ఎవరిదారుల్లో వారు ప్రయాణిస్తున్నామని దిలీప్ తెలిపాడు. 
 
1998లో జరిగిన తమ వివాహం ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. 2014లో ఆమెకు విడాకులు ఇచ్చిన దిలీప్ 2015లో మరో నటి కావ్యను వివాహం చేసుకున్నారు. అందువల్ల మంజు వారియర్‌తో తన బంధం ముగిసిపోయిన కథ అని దిలీప్ వ్యాఖ్యానించాడు.