మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (15:20 IST)

అఖిల్ నా కొడుకు, ఆమని సంచలన వ్యాఖ్యలు

అలనాటి హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగార్జున, అమలల రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ ను తన కుమారుడు అంటూ సంబోధించారు. ఎవరు ఏమనుకున్నా అఖిల్ తన కొడుకేనని చెప్పడం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
 
అప్పట్లో అఖిల్ నటించిన సిసింద్రీ సినిమా భారీ విజయాన్ని సాధించింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన సిసింద్రీ సినిమాకు అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
 
ఒకటిన్నర సంవత్సరం చిన్న పిల్లవాడిగా ఉన్న అఖిల్ సిసింద్రీ సినిమాలో చేసిన నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ సినిమాలు సిసింద్రీకి తల్లిగా ఆమని నటించారు.
 
సరిగ్గా 25 సంవత్సరాల తర్వాత మళ్లీ అఖిల్‌కు తల్లిగా నటిస్తున్నారు ఆమని. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరో అఖిల్ తల్లిగా ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను అఖిల్ ను చిన్నతనం నుంచి చూస్తున్నాను. చాలా క్యూట్ గా ఉంటాడు అఖిల్. 
 
అఖిల్‌లో నేను నా కొడుకును చూసుకుంటూ ఉంటాను. అఖిల్‌తో ఎన్ని సినిమాలు చేసిన అతనే నా కుమారుడు అంటూ ఆమని చెప్పుకొచ్చారు. ఎన్నో కష్టాలు పడి వచ్చిన తాను సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది అంటున్నారు ఆమని.
 
దర్శకనిర్మాతలు అవకాశాలు ఇస్తే తల్లి క్యారెక్టతో పాటు మిగిలిన క్యారెక్టర్ల లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రెమ్యునరేషన్ విషయం తనకు ముఖ్యం కాదని.. దర్శకులు ఇచ్చే క్యారెక్టర్ ముఖ్యమని చెప్పుకొచ్చారు.