గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:43 IST)

భీమ్లా నాయక్‌తో సూపర్ ఉమెన్.. ఫోటో వైరల్

వకీల్ సాబ్‌ దార మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ సినిమాలో చేసింది కొన్ని నిమిషాలైనా తన పాత్రకి తగ్గట్టుగా నటించిన అని చెప్పవచ్చు. సూపర్ ఉమెన్ అంటూ లిరిషా గురించి పవన్ చేసిన కామెంట్స్ హైలెట్‌గా మారాయి. పవన్ సినిమా నుంచే ఆమెకు మంచి పేరు వచ్చింది. 
 
తాజాగా లిరిషా పవన్ కళ్యాణ్‌తో భీమ్లానాయక్ సెట్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి తీయించుకున్న ఒక ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలో పవన్ పోలీస్ డ్రెస్‌లో ఉండగా ఆ ఫోటో భీమ్లా నాయక్ షూటింగ్ ఫోటో అంటూ క్యాప్షన్ పెట్టింది. 
 
అయితే ఆ ఫోటోలు చూసిన ప్రేక్షకులు లిరిషాకి భీమ్లా నాయక్ సినిమాలో మరో ఛాన్స్ కొట్టేసింది ఏమో అని అభిమానులు అనుకుంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.