వారివల్లే హీరోయిన్ల కెరీర్ పాడవుతోందిః ఇంధ్రజ, ఆమని ఆవేదన
సినిమారంగంలో వుండే కొందరివల్ల కథానాయికలకు చెడ్డ పేరు వస్తుందని నటీమణులు ఇంద్రజ, ఆమని తమ ఆవేదను వ్యక్తం చేశారు. ఇద్దరూ నాయికలుగా ఉచ్చస్థితిలో వుండగానే వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో కోర్టుకు కూడా ఇంద్రజ వెల్ళాల్సివచ్చింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే విందాం. కెరీర్ పీక్‌గా వున్నతరుణంలో ఇంద్రజ మలయాళ సినిమాలు చేస్తుంది. ఓ సినిమాకు అగ్రిమెంట్‌కూడా తీసుకుంది. దానికి తగినట్లు డేట్స్ కూడా ఆ నిర్మాణ సంస్థకు ఇచ్చింది. కానీ అనుకున్న టైంకు సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఇంద్రజ మలయాళంలో మమ్ముట్టి సినిమాలో నటించింది. ఆ చిత్రం షెడ్యూల్ జరుగుతుండగా అంతకుముందు అగ్రిమెంట్ రాసుకున్న నిర్మాతలు ఇంద్రజను తమ సినిమాలో నటించాలని పట్టుపట్టారట. విషయం ఇది అని ఆమె చెప్పినా వినలేదట. ఆ తర్వాత ఈమెపై కోర్టు వరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న మమ్ముట్టి తానే వాదిస్తానని ముందుకు రావడంతో ఆ నిర్మాతలు వెనకడుగువేశారట. దీన్ని ఆ సమయంలో మీడియా ఏదోదో తెలీసి తెలియని వార్తలు రాసేసి మాపై నిందలు వేశారని దాంతో కొంతకాలం కెరీర్ వెనుకంజవేసిందని వాపోయింది.
ఈ విషయం చెబుతుండగానే, ఆమనికూడా తన అనుభవంలోకి వచ్చిన ఓ సంఘటన పంచుకుంది. స్వచ్చంధసంస్థకు చెందిన కార్యక్రమాల్లో పాల్గొంటూ సంబంధించిన సేవా సంస్థకు ఫండ్ ఇస్తూంటుంది. ఓ సందర్భంలో అక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె వెళ్ళింది. ఇంకేముంది కొంతమంది మీడియా ఆమనికి గుండెజబ్బు అందుకే హార్ట్ అనే స్వచ్చంధ సంస్థకు చెందిన ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకుంది. త్వరలో ఆమె ఆపరేషన్ చేయించుకుంటుంది. అంటూ రాసేశారు. విషయం తెలిసేసరికి అది అందరికీ చేరిపోయింది. దాంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు ఒకటే ఫోన్‌లు. నేను ఆరోగ్యంగా వుండగానే నాకు అనారోగ్యం కట్టేశారంటూ.. ఇలాంటి రాసేముందు ముందు వెనుక ఆలోచించి వాస్తవాలు తెలుసుకుని రాయాలని సూచించింది. అయితే అప్పటికే ఆమెకు అన్యాయం జరిగిపోయింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆమెకు అవకాశాలు రాలేదు. కారణం హార్ట్ ఫేషెంట్ అని. మరి నా కెరీర్‌ను పాడుచేసిన వారిని ఏం చేయాలని ఆమని ప్రశ్నిస్తుంది. ఇటీవలే టీవీ ప్రోగ్రామ్‌లో అలీతో తన అనుభవాలను వారిరువురూ పంచుకున్నారు.