బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (13:01 IST)

గూగుల్ క్రోమ్ యూజర్లకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నుంచి క్రోమ్ వర్షన్ 54

గూగుల్ క్రోమ్ బౌజర్లకు గుడ్ న్యూస్. వేగంతో పనిచేసేలా క్రోమ్ వర్షన్ 54ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. దీన్ని డిసెంబర్‌ మొదటి వారంనాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల

గూగుల్ క్రోమ్ బౌజర్లకు గుడ్ న్యూస్. వేగంతో పనిచేసేలా క్రోమ్ వర్షన్ 54ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. దీన్ని డిసెంబర్‌ మొదటి వారంనాటికి పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. రాబోయే కొత్త వర్షన్‌ 55తో వీ8 జావాస్ర్కిప్ట్‌ ఇంజన్‌ను వాడనున్నారు.
 
ఈ బ్రౌజర్‌ గూగుల్ నుంచి రావడం.. అన్ని ఖాతాల నుంచి అనుసంధానం కావడంతో క్రేజ్ బాగా పెరిగిపోతోంది. ఈ వర్షన్ కొత్త అప్‌డేట్‌తో చాలా అంశాల్లో మెరుగ్గా ఉందని.. పేజీ లోడ్ వేగం 5.9 శాతం ఉంటుందని.. లోడ్ వేగం 14.8 శాతం, స్టార్టప్‌ టైమ్‌ వేగం 16.8శాతం పెరిగనట్లు గూగుల్ పేర్కొంది. 
 
భారీ ర్యామ్‌ యూసేజ్‌ కూడా తగ్గించేందుకు ఈ వర్షన్ బాగా ఉపయోగపడుతుందని గూగుల్ సంస్థ వెల్లడించింది. మార్కెట్‌లో ఉన్న వర్షన్‌ 53తో పోల్చితే.. దాదాపు 35 శాతం నుంచి 50 శాతం వరకు ర్యామ్ తక్కువ వాడుతుందని సంస్థ పేర్కొంది.