శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (20:47 IST)

మ‌హేష్ బాబు తండ్రిగా అనిల్ క‌పూర్‌!

Mahesh Babu, Anil Kapoor
Mahesh Babu, Anil Kapoor
సూప‌ర్ స్టార్ మ‌హే\ష్‌బాబు 11 ఏళ్ళ త‌ర్వాత ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లో సెట్‌పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో బాలీవుడ్ స్టార్ తోడుకాబోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు అనిల్ క‌పూర్‌.
 
మ‌హేష్ బాబుకు తండ్రిగా న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. గ్లామ‌ర్ హీరోకు గ్లామ‌ర్ తండ్రిని సెట్ చేసిన‌ట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇందులో పూజా హెగ్డే న‌టించ‌నుంది. ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందుతోంది.