మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 8 నవంబరు 2019 (18:04 IST)

రానాకు నాకు మధ్యలో మరో యువతి, ఇక అతడితో డేటింగా? రకుల్ ప్రీత్

ఉత్తరాది భామలు ఏదీ మనసులో దాచుకోలేరు. ఉన్నదివున్నట్లు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేస్తుంటారనే టాక్ వుంది. రకుల్ ప్రీత్ సింగ్ విషయంలో అదే నిజం అనిపిస్తోంది. తాజాగా ఆమె రానా గురించి, తనకు రానాకు లింక్ వున్నదంటూ జరుగుతున్న ప్రచారం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
 
రానాతో మీరు డేటింగ్ చేస్తున్నారటగా అనగానే, రెండు కళ్లూ బాగా పెద్దవిగా చేసి, ఇదిగో ఈ మాట ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. మొదట్లో కాస్త చిరాకు వేసింది. ఆ తర్వాత గాలివార్తలు పుట్టించేవారికి తెల్లారి లేచాక అలా ప్రచారం చేయకపోతే నిద్రపోలేరేమోనని వదిలేశానంది. అసలు రానాకు నాకు డేటింగ్ అనే ప్రచారం ఎలా వచ్చిందో నాకు తెలియడంలేదు. 
 
ఐతే రానా ఇల్లు, నా ఇల్లు పక్కపక్కనే వుంటాయి. జస్ట్ 2 నిమిషాల్లో రానా ఇంట్లోకి నేను వెళ్లవచ్చు. అలాగే రానా ఒక్క నిమిషంలో నా ఇంట్లోకి రావచ్చు. ఐతే రానా నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌మి. మా స్నేహం ఎంతోకాలంగా నడుస్తూ వుంది. దీన్ని అలా రాయడం చూసి నవ్వుకుంటుంటాను. మరో విషయం తెలుసా, రానా మరో అమ్మాయితో ప్రేమలో వున్నాడు. అలాంటప్పుడు అతడితో ప్రేమ లేదంటే డేటింగ్ ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తోంది రకుల్. ఆమె ప్రశ్న సంగతి ఏమోగానీ రానా మరో యువతితో ప్రేమలో వున్నాడని చెప్పింది. ఇంతకీ ఆ యువతి ఎవరో?