ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (15:08 IST)

'ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌' : ఫస్ట్‌లుక్‌తోనే వివాదం

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్". ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే వివాదాస్పదమైంది. ఈ చిత్రంలో మన్మోహన్‌ పాత్రను అనుపమ్‌ ఖేర్‌ పోషిస్తు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం "ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్". ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తోనే వివాదాస్పదమైంది. ఈ చిత్రంలో మన్మోహన్‌ పాత్రను అనుపమ్‌ ఖేర్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా అంతా మన్మోహన్‌, సోనియా గాంధీ చుట్టూనే తిరుగుతుందని సమాచారం.
 
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఆ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమా అంతా మన్మోహన్‌, సోనియా గురించే అని. అందుకే ఫస్ట్‌లుక్‌ విడుదల కాగానే వివాదాలు మొదలయ్యాయి. చిత్రంగా షూటింగ్‌ కూడా ఇంకా మొదలు కాకముందే సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ పహ్లాజ్‌ నిహ్లానీ స్పందించారు.
 
ముందుగా మన్మోహన్‌, సోనియాల అనుమతి తీసుకున్న తర్వాతే షూటింగ్‌ మొదలుపెట్టాలని దర్శక, నిర్మాతలకు సూచించారు పంకజ్‌. మరి, పంకజ్‌ సూచనను దర్శకనిర్మాతలు పాటిస్తారా? ఒకవేళ వారు అనుమతి కోరితే మన్మోహన్‌, సోనియా అంగీకరిస్తారా? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.