శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 31 జులై 2017 (14:13 IST)

దేవసేన బరువు తగ్గింది.. స్లిమ్‌గా మారిన స్వీటీ ఇక ''సాహో''లో నటిస్తుందా?

బాహుబలి దేవసేన బరువు తగ్గింది. భాగమతి సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా వున్న అనుష్క ప్రస్తుతం స్లిమ్‌గా మారినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘భాగమతి’ సినిమా కోసం అనుష్క పది కిలోల బరువ

బాహుబలి దేవసేన బరువు తగ్గింది. భాగమతి సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా వున్న అనుష్క ప్రస్తుతం స్లిమ్‌గా మారినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘భాగమతి’ సినిమా కోసం అనుష్క పది కిలోల బరువు తగ్గిందని తెలిసింది. ఈ సినిమాలో అనుష్కకు తల్లిగా టబు నటిస్తోంది. మలయాళ నటుడు జయరాం విలన్‌గా చేయబోతుండగా ఆది పినిశెట్టి ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నాడు. 
 
సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన స్వీటీ.. ఆపై బరువు తగ్గలేక నానా తంటాలు పడింది. బాహుబలి-2లోనూ అదే బరువుతో నటించింది. అనుష్కను అందంగా, స్లిమ్‌గా చూపెట్టేందుకు ఎస్ఎస్. రాజమౌళి గ్రాఫిక్స్ వర్క్ వాడాల్సి వచ్చింది. తాజాగా బరువు తగ్గేందుకే ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటించనని తేల్చేసిన అనుష్క.. అనుకున్నట్లే బరువును తగ్గించేసింది. 
 
ఈ క్రమంలో వ్యాయామాలు, యోగాలు ఇతరత్రా వర్కౌట్ల ద్వారా అనుష్క బరువును తగ్గించేసిందని తెలిసింది. ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కనిపించిన అనుష్క ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో అనుష్క చాలా స్లిమ్‌గా కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ సాహోలో అనుష్క నటించే ఛాన్సుండదని.. పూజా హెగ్డేను తీసుకునే దిశగా దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని సినీ వర్గాల సమాచారం.