మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (19:10 IST)

'అర్జున్ రెడ్డి' హీరోయిన్ అడిగినంత ఇచ్చేందుకు ప్రొడ్యూసర్స్ రెడీ

లిప్ టు లిప్ కిస్... ఈ కిస్ స్టిల్‌తో యూత్ హృదయాల్లో హీటెక్కించిన హీరోయిన్ అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని. అర్జున్ రెడ్డి చిత్రంలో ఈ హీరోయిన్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టరును తెలుగు

లిప్ టు లిప్ కిస్... ఈ కిస్ స్టిల్‌తో యూత్ హృదయాల్లో హీటెక్కించిన హీరోయిన్ అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని. అర్జున్ రెడ్డి చిత్రంలో ఈ హీరోయిన్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి లిప్ టు లిప్ కిస్ ఇవ్వడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పోస్టరును తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ కోసం కొన్నిచోట్ల బస్సులపై అంటించారు. 
 
ఈ పోస్టర్లను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు చింపేయడంతో ఆ చిత్రం క్రేజ్ ఆకాశమే హద్దుగా వెళ్లిపోవడం... సూపర్ హిట్ కావడం... జరిగిపోయింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు కూడా బాగా క్రేజ్ వచ్చేసింది. 
 
ఇప్పుడు హీరోయిన్ షాలిని తన పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. తన రెమ్యూనరేషన్ ఏకంగా పాతిక లక్షలు చేసినట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ టాక్. అక్కడ తమిళ హీరో జీవీ ప్రకాష్ సరసన 100 పర్సెంట్ కాదల్ అనే చిత్రంలో నటించడానికి ఆమె ఈ పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. అంత మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.