బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (17:44 IST)

'సాహో' తర్వాతనే ఏ డీల్ అయినా... రూ.18 కోట్ల డీల్ వదులుకున్న ప్రభాస్!

'బాహుబలి' ప్రాజెక్టుతో జాతీయ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ వ్యాపరపరంగా కూడా ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయింది. దీంతో ప్రభాస్‌తో చిత్రాలు చేసేందుకు, వ్యాపార ప్రకటనలు ఇచ్చ

'బాహుబలి' ప్రాజెక్టుతో జాతీయ స్టార్‌గా మారిన హీరో ప్రభాస్. ఈ ఒక్క చిత్రంతో ప్రభాస్ రేంజ్ వ్యాపరపరంగా కూడా ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయింది. దీంతో ప్రభాస్‌తో చిత్రాలు చేసేందుకు, వ్యాపార ప్రకటనలు ఇచ్చుకునేందుకు బడాబడా కంపెనీలు క్యూకడుతున్నాయి. 
 
దీనికి కారణం ప్రభాస్‌తో తమ కంపెనీల ప్రకటనలు చేయిస్తే వ్యాపారపరంగా దూసుకుపోవచ్చన్నది వాటి భావన. అందుకే ప్రభాస్ ఇంటి వద్ద ఆయా సంస్థల ప్రతినిధులు క్యూ కడుతున్నారు. ఇందులోభాగంగా, ప్రభాస్‌తో ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించాలని విన్నవించారు. 
 
కానీ ప్రభాస్ మాత్రం ఏ ఒక్క డీల్‌కు ఇంతవరకూ ఓకే చెప్పలేదట. ఇందుకు కారణం లేకపోలేదు. బాహుబలి తర్వాత తాను నటించే చిత్రం కూడా సూపర్ హిట్ కావాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. అందుకే వ్యాపార ప్రకటనల కంటే.. సినిమాపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, కొన్ని షూ కంపెనీలు, ఫిట్నెస్, ఎఫ్‌ఎమ్‌జీసీ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకునేందుకు సంప్రదించాయి. ఈ డీల్స్ విలువ రూ.18 కోట్ల పైమాటేనట. వీటన్నింటినీ ప్రభాస్ వదులుకున్నాడని టాక్. ప్రస్తుతం తను చేస్తున్న సాహో సినిమా పైనే ప్రభాస్ దృష్టి పెట్టాడని, ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఏ డీల్ అయినా కుదుర్చుకునే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది.