మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (17:44 IST)

''భాగమతి'' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు డార్లింగ్ వస్తున్నాడా?

లేడి సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న అనుష్క శర్మ తాజాగా ''భాగమతి'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం (జనవరి 21)న జరుగనుంది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన

లేడి సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకున్న అనుష్క శర్మ తాజాగా ''భాగమతి'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం (జనవరి 21)న జరుగనుంది. 'పిల్ల జమీందార్' ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన భాగమతి చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కగా ఈ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఆది పినిశెట్టి ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.
 
భాగమతి చిత్రాన్ని తెలుగులోనే కాక తమిళం, మలయాళ భాషలలోను డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం భాగమతి జనవరి 26న రిపబ్లిక్ డేకి  విడుదల కానుంది. ఫ్యాన్స్ మధ్య ఆసక్తిని రేకెత్తికొస్తోన్న భాగమతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభాస్ వస్తున్నట్టుగా సమాచారం. 
 
ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ ప్రభాస్‌కి హోమ్ బ్యానర్ వంటిది. ఇక అనుష్కతో ప్రభాస్ మంచి స్నేహం వున్నందున ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు బాహుబలి ప్రభాస్ వస్తున్నాడని తెలుస్తోంది. ఇక భాగమతి చిత్రంలోని మందార పాట లిరిక్స్‌ను ఈ వీడియోలో చూడండి.