శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 18 జనవరి 2018 (14:31 IST)

ప్రభాస్‌ను అన్నయ్య అని పిలవలేదట... మరి డార్లింగా? అనుష్క ఏమంటోంది?

"బాహబలి" చిత్రం కోసం ఐదేళ్ల పాటు కలిసి పని చేసిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం సాగినట్టు గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్ప

"బాహబలి" చిత్రం కోసం ఐదేళ్ల పాటు కలిసి పని చేసిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం సాగినట్టు గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఫిల్మ్ నగర్‌లో వార్తలు గుప్పుమన్నారు. ఈ వార్తలను వారిద్దరూ ఏనాడూ ఖండించలేదు.
 
అయితే, తాజాగా అనుష్క చేసిన వ్యాఖ్యలు మరోలా వినిపిస్తున్నాయి. "ప్రభాస్‌ను నేను అన్నయ్యా అని పిలవలేను. అందరు అబ్బాయిలనూ సోదరులుగా భావించలేము కదా? నా గురించి ఎలాంటి వార్తలు వస్తున్నాయో తెలియదు. నేనసలు వార్తా పత్రికలు చదవను.
 
ఇక పెళ్లి గురించి ఆలోచించడమైతే మానేశాను. నా కోసం ఓ మంచి అబ్బాయిని వెతికితే చేసుకుంటా. ఏ విషయం గురించీ ఎక్కువగా ఆలోచించడం లేదు. సమయం వచ్చినప్పుడు వాటంతట అవే జరిగిపోతుంటాయి" అని వ్యాఖ్యానించింది. 
 
కాగా, 'బాహుబలి' చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం 'భాగమతి'. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో భాగమతిగా అనుష్క అదరగొట్టింది. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.