శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (14:22 IST)

#BhaagamathieTrailer : ఇది భాగమతి అడ్డా.. లెక్కలు తేలాలి

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధానపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం "భాగమతి". ఈ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు మొదలైంది.

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క ప్రధానపాత్రధారిగా తెరకెక్కిన చిత్రం "భాగమతి". ఈ చిత్రం ట్రైలర్ సోమవారం విడుదల చేశారు. చాన్నాళ్ల క్రితమే ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ, మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎట్టకేలకు చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు.
 
ముఖ్యంగా అనుష్క నటించిన 'బాహుబలి' చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఈ అంచనాలు మరింతగా పెరిగాయి. 
 
ఈ చిత్రంలో అనుష్క ఐఏఎస్ అధికారిణిగా నటించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘పిల్ జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్‌లు కూడా పలు కీలక పాత్రలు పోషించగా, 2018 జనవరి 26వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.