శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 డిశెంబరు 2017 (12:11 IST)

''భాగమతి''లో రాజకీయ నాయకురాలిగా దేవసేన..

సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి సినిమాలతో అనుష్క నటనకు ఎందరో ఫిదా అయ్యారు. ఆపై ప్రభాస్ సరసన బాహుబ

సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి సినిమాలతో అనుష్క నటనకు ఎందరో ఫిదా అయ్యారు. ఆపై ప్రభాస్ సరసన బాహుబలిలో నటించి ప్రపంచ అభిమానుల కంటపడింది.

ప్రస్తుతం అనుష్క ''భాగమతి'' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న పాత్రల్లో కనిపించనుందట. లేడీ ఓరియెంటెడ్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన అనుష్క ఈ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకోవడం ఖాయమని సినీ పండితులు అప్పుడే జోస్యం చెప్తున్నారు. 
 
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇక భాగమతిలో అంచనాలకు అతీతంగా అనుష్క పోషించే రెండు పాత్రల్లో ఒకటి రాజకీయ నాయకురాలిగా ఉంటుందని టాక్. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో అనుష్క కనిపించలేదు.

ఇంకా దర్శకుడు ప్రస్తుతం జరిగే కథకు 500 ఏళ్లనాటి కథను జోడించి చూపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ''పిల్ల జమీందార్" ఫేం అశోక్ దర్శకత్వం వహిస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాను దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌లో తెరకెక్కించారు.