సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 డిశెంబరు 2017 (12:17 IST)

#BhaagamathieTeaser అరచేతిలో మేకు దిగగొట్టుకున్న అనుష్క (Video)

దేవసేన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన భాగమతి టీజర్ విడుదలైంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు దగ్గరైన యోగా టీచర్ అనుష్క... తాజాగా భాగమతి సినిమాలో నటిస్తోన్న సంగతి

దేవసేన అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ వచ్చిన భాగమతి టీజర్ విడుదలైంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు దగ్గరైన యోగా టీచర్ అనుష్క... తాజాగా భాగమతి సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో కొత్తగా కనిపించిన అనుష్క.. తనను తాను శిక్షించుకుని చేతికి మేకు కొట్టుకునేలా నిల్చుంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ బుధవారం రిలీజైంది. ఉరుములు, మెరుపుల మధ్య చీకటిలో శిధిలావస్థలో వున్న ఓ పాడుబడిన బంగ్లాలోకి అడుగుపెడుతుంది. 
 
ఆపై తన చేతికి తానే ఓ గోడకి ఆనించి.. అరచేతిలో మేకు దిగగొట్టుకుంటుంది. ఫస్టు లుక్ పోస్టర్ లో ఏదైతే చూపించారో.. ఫస్ట్ టీజర్‌లోను అదే దృశ్యాన్ని చూపించారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న భాగమతి సినిమాలో అనుష్క శెట్టి, ఉన్ని ముకుందన్, జయరామ్, ఆషా శరత్, ప్రభాస్ శ్రీను, మురళీ శర్మ, ధన్ రాజ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీ అశోక్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. తాజాగా విడుదలైన టీజర్ మీ కోసం..