గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Updated : ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (00:28 IST)

క్రిష్ అంతపని చేస్తాడనుకోలేదంటున్న బిగ్ బాస్ భామ హిమజ (వీడియో)

పవన్ కళ్యాణ్‌తో నటించాలని చాలామంది హీరోయిన్లు తపిస్తూ ఉంటారు. కొత్తగా వస్తున్న హీరోయిన్లు అయితే చెప్పనక్కర్లేదు. చిన్న క్యారెక్టర్ అయినా ఫర్వాలేదు పవర్ స్టార్ సరసన నటిస్తే చాలు అనుకునే వారు లేకపోలేదు. అలాంటి వారిలో హిమజ ఒకరు. చిన్నచిన్న క్యారెక్టర్లు చేసుకునే హిమజ ఇప్పుడు ఏకంగా పవన్ పక్కనే ఛాన్స్ కొట్టేసింది.
 
హిమజ. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్లు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఒకే షో బిగ్ బాస్ షోతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. అలా పాపులర్ కావడమే ఆమెకు బాగా కలిసొచ్చిందట. ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసిందట. ఇప్పుడు ఆమె పండుగ చేసుకుంటోందట. 
 
అది కూడా క్రిష్ దర్సకత్వంలో నటిస్తోందట. థ్యాంక్యు క్రిష్ సర్..అండ్ పవన్ కళ్యాణ్ సర్. నేను అసలు పవన్ కళ్యాణ్ సర్‌ను నేరుగా చూస్తాననుకోలేదు. నిజంగా క్రిష్ సర్‌కు ధన్యవాదాలు. నేరుగా క్రిష్‌ను ఒకసారి కలిసి ఏదైనా క్యారెక్టర్ కావాలి అన్నాను.
 
అయితే ఆయన ఏకంగా పవర్ స్టార్ పక్కన నటించే అవకాశం ఇచ్చారు. ఇది నిజంగానే మర్చిపోలేను. పవన్‌తో సినిమా చేసిన తరువాత నా కెరీర్ ఇంకా మెరుగవుతుందని అనుకుంటానంటోందట హిమజ. పవన్ సినిమాలో ప్రత్యేక పాత్రను హిమజ కోసం పెట్టారట క్రిష్.