శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (20:24 IST)

అక్షర` చూశాక సమాజంలో మార్పు రావాలి: క‌విత‌

Nanditha Swetha, Kavita, Saitej
నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అక్షర’. బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ నిర్మించారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి తేజ్, ఎమ్మెల్సీ కవిత, దర్శకులు సుధీర్ వర్మ, కృష్ణ చైతన్య, శ్రీకాంత్ అడ్డాల తదితర పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
 
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, చాలా మంది పిల్లలు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. అనేక కారణాలు ఉన్నా, చదువుల్లో ఉన్న ఒత్తిడి ప్రధానమైన సర్వేలు చెబుతున్నాయి. మనమంతా ఒక సమాజంగా చేయాల్సిన పని ఉంది. ఆ బాధ్యతను అక్షర టీమ్ కొంత తీసుకుంది. నేనూ భాగం కావాలని నేను ఈ కార్యక్రమానికి వచ్చాను.

రోజుకు నలుగురు ఐదుగురు పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు అని తెలిసిన తర్వాత మనం ఇంకా అప్రమత్తం కావాలని అనిపించింది. బట్టీ బట్టి సిలబస్ మార్చేసి సులువుగా విద్యను నేర్పే విధానాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. సినిమా మాధ్యమం ఎంతో శక్తివంతమైనది కాబట్టి సినిమా ద్వారా ఇలాంటి మంచి విషయం చెబితే సమాజానికి త్వరగా చేరుతుంది. `తారే జమీన్ పర్` సినిమా వచ్చాక, పిల్లలు సరిగ్గా చదవకపోతే తల్లిదండ్రులు ఎక్కడ లోపముందో ఆలోచించడం మొదలుపెట్టారు. అక్షర సినిమా చూశాక మన సమాజంలో విద్యను చూసే కోణంలో ఒక మార్పు రావాలి. నందిత బాగా నటించారని ఆశిస్తున్నా` అన్నారు.
 
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ, సినిమా టైమ్లో అహితేజ టెన్షన్లో ఉండేవాడు. కానీ అక్షర సినిమా రిలీజయ్యాక ఆయన టెన్షన్ తగ్గిపోతుంది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దర్శకుడు చిన్నికృష్ణతో నాకు చాలా రోజులుగా తెలుసు. నా కెరీర్ స్టార్టింగ్ లో కథ చెప్పేందుకు వచ్చారు. 6 ఏళ్లుగా చిన్నికృష్ణతో పరిచయం. ఎప్పుడు కలిసినా సరదాగా ఉంటుంది. నందితా చాలా బాగా నటించింది. ట్రైలర్ లో చూశాను. సీరియస్ టాపిక్ ఎంచుకుని చక్కగా నటించారు.

నేను ఈ ఈవెంట్ కు రావడానికి కారణం ఈ సినిమా నిర్మాతలు మెగా ఫ్యాన్స్. నా ఫ్యాన్స్ నిర్మాతలు అయినప్పుడు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అది నా బాధ్యత. నేను కొంత డల్ గా కెరీర్ లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ అంతా అండగా ఉన్నారు. నేనూ వారికి సహకారం అందించాలనుకున్నాను. అక్షర సినిమాలో విద్య మన హక్కు, నాణ్యమైన విద్య పిల్లలకు అందాలి అని చెప్పారు. ఈ చిత్రంలో వినోదంతో పాటు సందేశం ఉంటుంది. అక్షరను థియేటర్లో చూడండి, మంచి సినిమాను ఆదరించండి. అన్నారు.