శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (09:02 IST)

'యంగ్‌ మంగ్‌ సంగ్‌'లో ప్రభుదేవాకు సరసన కేథరిన్.. డ్యాన్స్ అదరగొడుతుందా?

విజయ్ దర్శకత్వంలోని దేవి ద్వారా హీరోగా హిట్‌ను సొంతం చేసుకున్న ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నృత్య దర్శకుడు ప్రభుదేవా మరో సినిమాలో హీరోగా నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త

విజయ్ దర్శకత్వంలోని దేవి ద్వారా హీరోగా హిట్‌ను సొంతం చేసుకున్న ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నృత్య దర్శకుడు ప్రభుదేవా మరో సినిమాలో హీరోగా నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తెలుగు, తమిళ చిత్ర సీమలతోపాటు బాలీవుడ్‌లోనూ ప్రభుదేవా మంచి నటుడు, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
తాజాగా కొత్త దర్శకుడు అర్జున్‌ చెప్పిన కథ నచ్చడంతో ఆయన చిత్రాన్ని అంగీకరించారు. 'ముండాసుపట్టి' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు అర్జున్‌. కొత్త చిత్రంలో ప్రభుదేవా సరసన కేథరిన్‌ను ఎంపిక చేశారు. 'మద్రాస్‌' సినిమాతో చక్కని గుర్తింపు సొంతం చేసుకున్న కేథరిన్‌... ఇటీవల 'కథకళి' ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ చిత్రానికి 'యంగ్‌ మంగ్‌ సంగ్‌' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో కేథరిన్ డ్యాన్స్ అదరగొడుతుందని.. ప్రభుదేవాకు ధీటుగా డ్యాన్స్ చేసేందుకు స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.