శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (10:55 IST)

భర్తతో విడిపోలేదు ... ఆ ఫోటోలు ఆర్కివ్‌లో దాచుకున్నా : 'కలర్స్' స్వాతి

తన భర్తతో విడిపోయినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై సినీ నటి 'కలర్స్' స్వాతి క్లారిటీ ఇచ్చారు. తన భర్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించినంతమాత్రాన తాను తన భర్తతో విడిపోయినట్టు కాదనీ, ఆ ఫోటోలను ఆర్కివ్‌లో దాచుకున్నట్టు వివరించారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈమె... 'పైలట్' వికాస్‌ వాసును పెళ్లి చేసుకుంది. కానీ, కొద్ది రోజుల్లోనే అతనితో విడిపోయినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 
 
ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. గతంలో ఇలియానా, స‌నాఖాన్ త‌దిత‌రులు వారి బాయ్‌ఫ్రెండ్స్‌తో విడిపోయినప్పుడు వారితో క‌లిసున్న ఫొటోల‌ను త‌మ తమ సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. 
 
అలాగే స్వాతి కూడా ఆమె భ‌ర్త‌తో ఉన్న ఫొటోల‌ను త‌న ఇన్‌స్టా‌గ్రామ్ నుంచి తొల‌గించింది. దీంతో అంద‌రూ స్వాతి ఆమె భర్త నుంచి విడాకులు తీసుకోనుందంటూ వార్త‌ల‌ను వచ్చాయి. 
 
అయితే ఈ వార్త‌ల‌కు హ‌రీ పోట‌ర్‌లోని ఓ స‌న్నివేశంతో చెక్‌పెడుతూ ఆ డైలాగ్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసి పోస్ట్ చేయ‌డ‌మేకాకుండా భ‌ర్త‌తో తానున్న ఫొటోల‌ను ఆర్కివ్‌లో దాచుకున్న విష‌యాన్ని వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు.