ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (15:02 IST)

రంగస్థలం కోసం సుకుమార్ సాహసం... నదిని సృష్టిస్తున్నారట.. ఎక్కడ?

రంగస్థలం కోసం దర్శకుడు సుకుమార్ సాహసం చేస్తున్నాడు. రంగస్థలం 1985 సినిమా కోసం, గోదావరి-సముద్రంలో కలిసే తీరంలోని ఒక పల్లెకి వెళ్ళి అక్కడ సుకుమార్ కొంతభాగం చిత్రీకరణ జరిపారు. అక్కడ చిత్రీకరణకు అనుకూలంగా

రంగస్థలం కోసం దర్శకుడు సుకుమార్ సాహసం చేస్తున్నాడు. రంగస్థలం 1985 సినిమా కోసం, గోదావరి-సముద్రంలో కలిసే తీరంలోని ఒక పల్లెకి వెళ్ళి అక్కడ సుకుమార్ కొంతభాగం చిత్రీకరణ జరిపారు. అక్కడ చిత్రీకరణకు అనుకూలంగా లేని సన్నివేశాల కోసం హైదరాబాదులో సెట్ వేయిస్తున్నారట. రూ.5కోట్ల ఖర్చుతో నదీ తీరంలోని పల్లెటూరు సెట్‌ను సుకుమార్ వేస్తున్నాడట. ఈ సెట్లో విజువల్ ఎఫెక్ట్ ద్వారా నదిని సృష్టించనున్నారని తెలిసింది. 
 
వాస్తవానికి దగ్గరగా విజువల్ ఎఫెక్ట్ ఉండేలా దీన్ని చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి సెట్లు చాలా కనిపిస్తాయి. హాలీవుడ్‌కు ధీటుగా తెలుగు సినిమాలో ఇలాంటి సెట్స్ కనిపించనుండటం మంచి పరిణామమని సినీ పండితులు అంటున్నారు. కాగా రామ్ చరణ్, సమంత నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నీ పనులు పూర్తి చేసుకుని సంక్రాంతికి రంగస్థలం చిత్రాన్ని విడుదల చేయనున్నారు.