శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (18:13 IST)

సన్నీ లియోన్‌కు కొత్త చిక్కు.. దత్తపుత్రిక రూపురేఖల్ని బయటపెడితే ఎలా?

సన్నీ లియోన్‌కు కొత్త సమస్యొచ్చి పడింది. శృంగార తార సన్నీ లియోన్ దంపతులు దాదాపు రెండేళ్ల వయసున్న పాపను దత్తత తీసుకున్నారు. సన్నీలియోన్, ఆమె భర్త వెబర్ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అనే పేరు కూడా పెట్టారు

సన్నీ లియోన్‌కు కొత్త సమస్యొచ్చి పడింది. శృంగార తార సన్నీ లియోన్ దంపతులు దాదాపు రెండేళ్ల వయసున్న పాపను దత్తత తీసుకున్నారు. సన్నీలియోన్, ఆమె భర్త వెబర్ చిన్నారికి నిషా కౌర్ వెబర్ అనే పేరు కూడా పెట్టారు. ఆ చిన్నారితో ఉన్న ఫోటోను సన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తాను దత్తపుత్రికను పొందిన విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పంచుకుంది. 
 
అయితే ప్రస్తుతం దత్తపుత్రిక ఫోటోను బయటపెట్టడం ద్వారా కొత్త చిక్కొచ్చి పడింది. ఆ చిన్నారి ఫొటోను, ఆమె రంగు, రూపురేఖలను బయటపెట్టడం తప్పంటూ.. కేంద్రంలోని సెంట్రల్ అడాప్షన్ అథారిటీ (సీఏఆర్ఏ) ఫైర్ అయ్యింది. ఇది జువైనల్ జస్టిస్ యాక్ట్‌ను ఉల్లంఘించినట్లవుతుందని సీఏఆర్ఏ మండిపడింది. 
 
దీనిపై మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీకి ఫిర్యాదు చేసింది. అయితే, చిన్నారిని దత్తత తీసుకున్నందుకు వారిని అభినందిస్తూనే సీఏఆర్ఏ ఈ ఫిర్యాదు చేసింది. 
 
కాగా సన్నీలియోన్‌, వెబర్‌లకు 2011లో వివాహం జరిగింది. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందిన 21 నెలల వయసున్న పాపను సన్నీ-వెబర్‌ దంపతులు దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. సన్నీలియోన్ కూతురు నిషా కౌర్ వెబర్ ఫస్ట్ ఫోటో అంతర్జాలంలో ఇటీవల వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.