శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By venu
Last Updated : శుక్రవారం, 19 మే 2017 (11:09 IST)

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ వెనక్కు తగ్గకుండా దూసుకెళ్తున్న ప్రియాంకాచోప్రా ఇటీవల ఓ ఇబ్బందికరమైన, అసహ్యకరమైన సందర్భంలో చిక్కుకుంది. బేవాచ్ గర

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ వెనక్కు తగ్గకుండా దూసుకెళ్తున్న ప్రియాంకాచోప్రా ఇటీవల ఓ ఇబ్బందికరమైన, అసహ్యకరమైన సందర్భంలో చిక్కుకుంది. బేవాచ్ గర్ల్‌గా ఇటీవల మరింత పాపులారిటీని సంపాదించుకున్న ప్రియాంకా చోప్రాను అక్కడి పరిశ్రమ వర్గాలే కాకుండా, బుల్లితెర వ్యాఖ్యాతలు సైతం చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలకు నిదర్శనంగా మరో ఉదంతం చోటు చేసుకుంది. హాలీవుడ్‌కు వెళ్లినప్పటి నుండి ఎన్నో సినిమాల్లో అధరచుంబనాలకు, పడకగది సన్నివేశాలకు, గాఢమైన శృంగార సన్నివేశాలకు ఏనాడు సిగ్గుపడని ఈ భామను ఓ వ్యాఖ్యత ఒకే ప్రశ్నతో డిఫెన్స్‌లోకి నెట్టేసాడు.
 
"వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్" అనే టీవీ షోలో ప్రియాంకను ఆ షో హోస్ట్ కోహెన్ ఓ చెత్త ప్రశ్న వేసాడు. బేవాచ్ నటులు డ్వేన్ జాన్సన్, జాక్ ఎఫ్రాన్‌లలో ఎవరి పురుషాంగం పెద్దదో సమాధానం చెప్పాలన్నాడు. ఖంగుతిన్న ప్రియాంక కాసేపటికే తేరుకుని, తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో "ఇది ప్రశ్నల్లో భాగం కాదు" అంటూ తప్పించుకుంది.
 
అనేక టీవీ షోలలో సందర్భోచితంగా సమాధానాలివ్వడమే కాక, తన అద్భుతమైన అమెరికన్ యాసతో వీక్షకులను ఆకట్టుకున్న ప్రియాంకా చోప్రాకు హాలీవుడ్ జనాల్లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఇలా సహనటుల పురుషాంగాల్లో ఎవరి సైజు పెద్దది వంటి జుగుప్సాకరమైన ప్రశ్న కేవలం ఆమె భారతీయురాలు కావడం వల్లనే ఎదుర్కొవలసి వచ్చిందని, ఇది కేవలం జాత్యహంకారమేనని అంటున్నారు సినీ పండితులు.