వచ్చే వారం దిల్ రాజుకు డబ్బింగ్ సినిమాల సెగ వుంటుందా?
goat,famiysat, anjuman
కాగా, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు పెద్దగా లేవనే టాక్ నెలకొంది. ఆల్ రెడీ నాలుగేల్ళ నుంచి కష్టపడుతూ ప్రుధ్వీరాజ్ గోట్ లైఫ్ తీసి తన కెరీర్ ను పణంగా పెట్టుకుని చిరంజీవి సినిమాలు కూడా వదులుకున్నాడు. అందుకే తెలుగులో మైత్రీమూవీస్ వారితో చేతులు కలిపి రిలీజ్ చేసుకుంటున్నాడు. త్వరలో ఆయన మైత్రీ మూవీస్ లో ఓ సినిమా కూడా చేయబోతున్నాడు.
ఇక రెండో డబ్బింగ్ సినిమా మంజుమ్మెల్ బాయ్స్' యూత్ సినిమా. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చిపెట్టింది. దీనిని యూత్ బాగా కనెక్ట్ అవుతారని మైత్రీ మూవీస్ రవి తెలియజేస్తున్నారు. ఇక నైజాంలో అగ్ర పంపిణీదారుడు దిల్ రాజు మాత్రం సెంటిమెంట్ సినిమాగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ను అత్యధిక థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. దాంతో థియేటర్లు తగ్గడంతో కొద్దిపాటితో మైత్రీ మూవీస్ పరిమితం అవుతుంది. చిత్రంలోని కంటెంట్ కొత్తదనం వుంటే ఇప్పటి యూత్ డబ్బింగ్ సినిమాలకే ఎగబాడతారని ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఏమి అవుతుందో చూడాల్సిందే.
