అఖిల్ పైన ఆ వార్తను చూసి క్రిష్ షాక్ అయ్యాడట... ఏంటది?
అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను. తొలిప్రేమ చిత్రంతో విజయం సాధించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది కానీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు. దీంతో అఖిల్, హలోతో పాటు మిస్టర్ మజ్ను చిత్రం కూడా ఫ్లాప్ చిత్రాల లిస్ట్ లోనే చేరింది.
దీంతో అఖిల్ నాలుగవ సినిమా ఎవరితో చేయనున్నాడు అనేది ఆసక్తిగా మారింది. శ్రీను వైట్లతో అఖిల్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శ్రీను వైట్ల కాదు.. ఆది పినిశెట్టి సోదరుడు సత్య ప్రభాస్ పినిశెట్టితో చేయనున్నాడు అనే టాక్ వచ్చింది.
తాజాగా విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్‌తో అఖిల్ సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. విషయం ఏంటంటే... అఖిల్ నటించిన మూడు చిత్రాలు సక్సస్ కాకపోవడంతో నాగార్జున అఖిల్ సినిమా విషయమై క్రిష్‌తో మాట్లాడారని.. క్రిష్ తెరకెక్కిస్తోన్న మహా నాయకుడు రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పైన క్లారిటీ వస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తను చూసి క్రిష్ కూడా షాక్ అయ్యాడట. అఖిల్‌తో సినిమానా..? అసలు ఆ ఆలోచనే లేదు అంటూ ప్రచారంలో ఉన్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చేసాడు క్రిష్.